AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. శనివారం అనంతలక్ష్మి(72) అనే మహిళ చనిపోవడంతో మృతుల సంఖ్య 10కి చేరింది. ముగ్గురు చిన్నారులు సహా 10 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురికి వెంటిలేటర్‌పై డయాలసిస్ చేస్తున్నారు.