కల్తీ కల్లు ఘటనలో చికిత్స పొందుతోన్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ఆరా తీశారు. నిమ్స్, గాంధీ ఆసుపత్రుల వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు మంత్రికి వివరించారు. నిమ్స్‌లో 35 మంది, గాంధీలో 18 మందికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. కాగా మంత్రి ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌లో పర్యటిస్తున్నారు.