AP: ఆధునిక సాగు యంత్రాల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వాణిజ్య పంటల కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శాస్త్రీయ విధానంలో సాగు ప్రణాళిక, ఆధునిక యంత్రాలు, డ్రోన్ల వినియోగంతో వ్యవసాయ ఖర్చులు తగ్గించాలని సూచించారు. ఓ వెబ్‌సైట్ ప్రారంభించి పరికరాల వివరాలు తెలియజేయాలన్నారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కపాస్ కిసాన్ యాప్‌లోని సమస్యలను సీసీఐ అధికారులు పరిష్కరించాలన్నారు.