ఇవాళ 58 మండలాల్లో, రేపు 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA వెల్లడించింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా చూసుకోవాలని హెచ్చరించింది. డీహైడ్రేట్ కాకుండా ORS, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలని సూచించింది.