ALERT: రాష్ట్రంలో విభిన్న వాతావరణం

AP: రాష్ట్రంలో సోమవారం విభిన్న వాతావరణం నెలకొంది. కోస్తాంధ్రలో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 41-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, బాపట్ల, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్