అలర్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు

ఏపీలో మంగళవారం 8 మండలాల్లో తీవ్రవడగాలులు, 13 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, పోలవరం, విజయనగరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు విజయనగరం, మన్యం, విశాఖ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో అస్సలు బయటకు రావొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్