AP: కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను సైతం ప్రభుత్వం సులభతరం చేసింది. జనవరి నుంచి జూన్ వరకు అప్లై చేసుకున్న వారికి జులైలో కొత్త కార్డులు ఇవ్వనుంది. జూలై నుంచి డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే ఏడాది జనవరిలో కొత్త కార్డులు అందిస్తారు. ఇక కొత్తగా పెళ్లైన దంపతులు సైతం రేషన్ కార్డు ఈజీగానే పొందొచ్చు. ఇందుకు ఆధార్ కార్డులు, మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే చాలు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మ్యారేజ్ స్ప్లిట్ ఆప్షన్ ద్వారా కొత్త రేషన్ కార్డు పొందొచ్చు.