AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం సహా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గో, ప.గో, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అల్లూరి, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురవనున్నట్లు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాాలని సూచించింది.