తుఫాన్‌పై ప్రజలను అప్రమత్తం చేయండి: డిప్యూటీ సీఎం పవన్

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్‌తో టెలికాన్ఫరెన్స్‌లో మట్లాడిన ఆయన.. తీరం వెంబడి గ్రామాల ప్రజలను ముందుగానే హెచ్చరించి, సురక్షితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, ఔషధాలను సమకూర్చడం, రెవెన్యూ, వ్యవసాయ, నీటి పారుదల, పోలీసు, అగ్నిమాపక, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్