ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 4 రోజుల్లో ఉపరితల ద్రోణిగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. అయితే, అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. నిన్న దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.