ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్