ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: పోలవరం, అల్లూరి జిల్లాల్లో శనివారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్సుందని వెల్లడించింది. అలాగే అక్టోబర్ 12న ఉత్తర అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో అక్టోబర్ 13 నాటికి అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్

✕
✕