AP: వాయుగుండం ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.