ALERT: రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని APSDMA తెలిపింది. బుధవారం ఉత్తరాంధ్ర, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్సుందని వెల్లడించింది. పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్