AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఈ మేరకు విశాఖ, కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు జారీ చేసింది.