అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిమ్మల

AP: ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, ఉపనదులకు భారీ వరద వస్తోందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరదను ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ రోజు సాయంత్రం ప్రకాశం బ్యారేజికి 6 నుండి 6.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్