AP: రాష్ట్ర అభివృద్ధికి అన్ని రంగాలు ముఖ్యమని మంత్రి లోకేశ్ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర అభివృద్ధిలో క్వాంటం టెక్నాలజీ ఎంత ముఖ్యమో.. వ్యవసాయం, ఉద్యానవన (హార్టికల్చర్) రంగాలూ అంతే ముఖ్యం. మేము కేవలం ఎంవోయూలకు పరిమితమవ్వం. ఆచరణలోకి తీసుకొస్తాం. 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్', ఆర్సెలర్ మిట్టల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్, గూగుల్ డేటా సెంటర్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు’ అని అన్నారు.