ఏపీలో పలుచోట్ల కూటమి ఏకగ్రీవాలు

- చిత్తూరు కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్లలో టీడీపీ 47, జనసేన 2, బీజేపీ, వైసీపీ చెరోచోట ఏకగ్రీవమయ్యాయి.
- విజయవాడ కార్పొరేషన్‌లోని 86 డివిజన్లలో టీడీపీ ఒక డివిజన్, ఒంగోలు కార్పొరేషన్‌లోని 62 డివిజన్లలో టీడీపీ 3 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. 
- కడప కార్పొరేషన్‌లోని 66 డివిజన్లలో టీడీపీ 47, జనసేన ఒకటి, బీజేపీ 2 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. 
- నెల్లూరు కార్పొరేషన్‌లో 72 డివిజన్లలో టీడీపీ 8 డివిజన్లు, కర్నూలు కార్పొరేషన్‌లో 68 డివిజన్లలో టీడీపీ ఒకటి, తిరుపతి కార్పొరేషన్‌లో 66 డివిజన్లలో టీడీపీ 2 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి.
- దాచేపల్లి, పిడుగురాళ్ల, గురజాల, నగరి, కనిగిరి, బద్వేలు, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, రాజంపేట, పుంగనూరు, రాయచోటి, గుత్తి, ఆళ్లగడ్డ, ఆత్మకూరు ఛైర్‌పర్సన్ స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి ఛైర్‌పర్సన్ స్థానం జనసేన, కడప జిల్లా ఎర్రగుంట్ల ఛైర్‌పర్సన్ స్థానం బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕