AP: కాకినాడ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు, కూటమి నేతలకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్లో అభివృద్ధి సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని, కూటమి నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటముల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, జనసేన పార్టీ గౌరవానికి ఎక్కడా భంగం వాటిల్లకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన నేతలకు, కార్యకర్తలకు స్పష్టం చేశారు.