పల్స్ పోలియో కార్యక్రమంలో 3215 మంది పిల్లలకు చుక్కలు

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటవురట్ల మండలంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం కె.వెంకటాపురం పరిధిలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చంద్రశేఖర్ అన్నవరం, ఎండపల్లి పోలియో కేంద్రాలను సందర్శించి తనిఖీ చేశారు. వైద్య అధికారి ఎస్.సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో 0-5 సంవత్సరాల లోపు 3215 మంది పిల్లలకు పోలియో చుక్కలు వంద శాతం వేయడం జరిగిందని ఎం పి హెచ్ ఈ ఓ బుల్లిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ రమణమ్మ, ఎం ఎల్ హెచ్ పి మరియమ్మ, వైద్య సిబ్బంది, ఆశా, అంగనవాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్