చిన్నగుమ్ములూరు పాఠశాలలో 41 మంది కొత్త విద్యార్థుల ప్రవేశాలు

ఎస్.రాయవరం మండలం చిన్నగుమ్ములూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026 విద్యా సంవత్సరానికి గాను 41 మంది కొత్త విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రైవేటు పాఠశాలల నుండి 11 మంది, ఇతర ప్రభుత్వ పాఠశాలల నుండి 30 మంది విద్యార్థులు బదిలీపై చేరినట్లు ప్రధానోపాధ్యాయులు శకుంతల తెలిపారు. పాఠశాలలోని వసతులు, డిజిటల్ బోధన, ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా ప్రాంగణం, పదిలో మంచి ఫలితాలు వంటి అంశాలు ఈ చేరికలకు దోహదపడ్డాయని మంగళవారం ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్