అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు ముఖ్య అతిథి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ట్యాబులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు రిసోర్స్ పర్సన్స్ అందరూ కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రతి మహిళకు చేరే విధంగా కృషి చేయాలని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు.