ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధభూమిలో విరోచితంగా పోరాడుతూ మన తెలుగు బిడ్డ సత్యసాయిజిల్లా కల్లితండాకు చెందిన జవాను మురళీనాయక్ వీరమరణం పొందడం పట్ల తీవ్ర రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు విడిచిన మురళీ వీర మరణం తెలుగు ప్రజలకే కాక దేశ ప్రజలందరికీ స్పూర్తి దాయకమన్నారు.