ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్, కైలాసగిరి మైదానంలో శుక్రవారం జరిగిన స్టాఫ్ పరేడ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరేడ్ కమాండర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ మన్మధరావు నేతృత్వంలో ఏ.ఆర్ డీఎస్పీ పి. నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్పీకి గౌరవ వందనం అర్పించారు. అనంతరం పరేడ్‌ను సమీక్షించి, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.