కోటవురట్లలో చెత్త తొలగింపు

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటవురట్లలో బుధవారం ఇన్చార్జి ఎంపీడీవో కూర్మారావు ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం జరిగింది. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తను తొలగించి, కాలువలు మూసుకుపోకుండా చర్యలు చేపట్టారు. ఇళ్ల నుంచి తెచ్చిన చెత్తను రోడ్లపై వేయడం వల్ల కాలువలు మూసుకుపోతున్నాయని, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రజలు సహకరించాలని ఎంపీడీవో కూర్మారావు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రఘురాం, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్