గురజాడ అప్పారావు 164వ జయంతి ఘనంగా నిర్వహణ

మండల కేంద్రమైన కోటవురట్ల పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రధాన ఉపాధ్యాయులు కొర్రా షేమో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు 164వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హెచ్ఎం మాట్లాడుతూ గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21న జన్మించారని, తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, హేతువాది అని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕