అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని సోముదేవపల్లి గ్రామంలో ఆదివారం పర్యటనలో భాగంగా రాష్ట్ర హోం మంత్రివర్యులు వంగలపూడి అనిత చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 5 ఏళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజానికి కృషి చేయాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.