జనసేన నిర్మాణ సారథుల సమావేశాలు: షెడ్యూల్ విడుదల

అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జూన్ 30 నుంచి జూలై 3 వరకు నియోజకవర్గాల వారీగా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. జూన్ 30న నర్సీపట్నం, అనకాపల్లి, జూలై 1న చోడవరం, మాడుగుల, జూలై 2న యలమంచిలి, అనకాపల్లి, జూలై 3న పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో సమావేశాలు జరుగుతాయి. పార్టీ పరిశీలకులు పెండెం దొరబాబు, సంబంధిత నాయకులు తమ బయోడేటాతో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్