ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ఎలమంచిలి శ్రీ గురజాడ అప్పారావు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఈనెల 15న 24 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్. గోవిందరావు బుధవారం తెలిపారు. ఈ ఇంటర్వ్యూలలో 10వతరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ వరకు చదువుకొని 18 నుండి 35 ఏళ్ల వయస్సు గల యువతీ, యువకులు పాల్గొనవచ్చన్నారు.