అంగన్వాడీల సమస్యలపై జులై 10న కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన

అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 10వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అచ్యుతాపురం, హరిపాలెం, మడుతూరు అంగన్వాడీలు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ లక్ష్యాలకు విరుద్ధంగా అనేక యాప్‌లను తీసుకొస్తున్నాయని, ఇప్పటికే పోషణ ట్రేకర్, బాల సంజీవన యాప్‌ల ద్వారా సెంటర్ నిర్వహణ చేస్తున్నామని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న టిఏ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్‌లుగా అప్‌గ్రేడ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్