అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గ్రామపంచాయతీలో జరిగిన బిబిజి రాంజీ పనులకు సంబంధించి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో ఉషశ్రీ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ సమన్వయ సమావేశం నిర్వహించారు. గురువారం నుంచి గ్రామపంచాయతీ పనులు, వేతనదారులు, మెటీరియల్, హౌసింగ్, సర్వశిక్ష అభియాన్ కాంపౌండ్ వాల్స్, ఫారెస్ట్ నర్సరీ, సామాజిక భద్రతా పింఛన్ల డేటాను తనిఖీ చేయనున్నట్లు ఎస్ఆర్పీ సీహెచ్ రామచంద్రరావు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవోలు, ఏపీవో, ఎంఈవో, జడ్పీటీసీ సభ్యురాలు, ఎంపీటీసీ, మండల నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల సిబ్బంది, సోషల్ ఆడిట్ డీఆర్పీలు పాల్గొన్నారు.