అనకాపల్లి సిద్దార్ధ సోషల్ సర్వీస్, కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగరo ప్రభుత్వ ఎస్. సి. హాస్టల్ లో ప్రముఖ తెలుగు సినీ నేపథ్య గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 79వ జయంతి వేడుకలను ఘనoగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టల్లో గల విద్యార్థులకు తెలుగు సినీ పాటల పోటీలు నిర్వహించి విజేతలకు హాస్టల్ వార్డెన్ భాగమతి రామయ్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.