ఆదివారం, రాట్నాలపాలెం గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమంలో టీడీపీ గ్రామ నాయకులు కుమార్ కాకర పాల్గొన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఉచితంగా పోలియో చుక్కలు వేయించాలని, ఇవి పిల్లల భవిష్యత్తుకు రక్షణ కవచమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లోవరాజు, అప్పలరాజు, వైద్య సిబ్బంది అరుణ, రంజిత కూడా పాల్గొన్నారు.