వెంకటపవన్ కుమార్ మూడవ వర్ధంతి: వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం, రావికమతం గ్రామంలో మునబర్త వెంకటపవన్ కుమార్ మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు వి.ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం ఆశ్రమంలో వృద్ధులకు, వికలాంగులకు ఫ్రూట్స్, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటపవన్ కుమార్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చేతుల మీదుగా అన్నదానం చేశారు. "వెంకటపవన్ కుమార్ గారికి ఇది ఆత్మకు శాంతిని చేకూరుస్తుంది" అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు, అనాధ పిల్లలకు అన్నదానం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕