32 కిలోల గంజాయి స్వాధీనం: సీలేరు ఎస్ఐ

జీకేవీధి మండలం ఐస్ గెడ్డ సమీప చిత్రకొండ జంక్షన్ వద్ద 32 కిలోల గంజాయి పట్టుబడిందని సీలేరు ఎస్ఐ ఎండీ యాసిన్ తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం వాహన తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. అనంతరం గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేరళకు చెందిన ఒకరు, జీకేవీధి మండలానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్