అరకులోయ మండలంలో ఆదివారం 80 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీఐ జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో ఒడిశా నుంచి కర్ణాటకకు గంజాయి తరలిస్తున్న నలుగురిని గుర్తించారు. పోలీసులను చూసి ఇద్దరు పరారవగా, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు మూటల్లో 80 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, రూ. 2,100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మల్లేశ్వరరావు తెలిపారు.