అరకులోయ మండలం దొరవలస గ్రామానికి చెందిన కన్నయ్య, తల్లి నుంచి వేరైన ఒక ఎలుగు పిల్లతో ఏడాది క్రితం అనూహ్యమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. అతడు ఆ పిల్లని ఇంటికి తెచ్చుకొని పెంచుకున్నారు. పలుమార్లు అటవీ ప్రాంతంలో వదిలిపెట్టినా, ఆ ఎలుగు పిల్ల కన్నయ్య ఇంటికి తిరిగి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఎలుగు పిల్ల గ్రామస్తులతో కలిసిమెలిసి తిరుగుతూ ఎవరికీ హాని చేయకుండా ఉంది. అటవీ శాఖ అధికారులు దీనిపై పర్యవేక్షణ చేస్తున్నారు.