అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ పరిధి మండపర్తి గ్రామంలో శనివారం టి. ఆర్. హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మండల చైర్మన్ పాటి రవికుమార్, వైస్ చైర్మన్ దారపి దుక్కు, ఉమెన్ వింగ్ చైర్మన్ కోర దారమ్మ, కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.