అడ్డతీగల గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్డతీగల-గంగవరం వైపునకు బైక్‌పై వెళ్తున్న యువకుడి వాహనం అదుపుతప్పి, బండరాయిని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న జడ్డంగి పీహెచ్సీ డాక్టర్ పావని సకాలంలో సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలను కాపాడారు. అనంతరం క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.