అనంతగిరి: పొంగిన కొండ వాగు రాకపోకలకు గిరిజనుల ఇబ్బందులు

అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ పరిసర ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పెదకోట కూడియాకు మధ్య కల్వర్టుపై కొండవాగు పొంగి ప్రవహిస్తుండడంతో వరద నీరు ఉదృతికి గిరిజనులు తమ ద్విచక్ర వాహనాలను భుజాలపై మోస్తూ తమతమ గ్రామాలకు చేరుకుంటున్నారు. అధికారులు స్పందించి ఈ కల్వర్టుపై వంతెన నిర్మాణం చేపట్టి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్