చింతపల్లి ఆర్ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహనరావు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ పథకాన్ని ఐటీఐ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 12న అరకు ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్ మేళా నిర్వహించబడుతుందని, ఇందులో ప్రముఖ పరిశ్రమలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.