అరకులోయ మండల పరిసర ప్రాంతంలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. శుక్రవారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో అరకులోయ పరిసర ప్రాంతాల్లోని పర్వతాలు గ్రామాలు కనిపించడంలేదు. పక్షుల కిలకిల రావాలు చల్లటి వాతావరణం శీతకాలన్నీ తలపిస్తుండడంతో పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. పొగమంచు అందాలు తమ ఫోన్లలో బంధించి మంత్రముగ్దులయ్యారు.