అరకులోయ మండలంలోని మాడగడ పంచాయతీ పరిధి మంజగుడ పరిసర ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో మంజగుడకి చెందిన పశువుల కాపరి సమర్డి. డొంబు(63)పశువులను గ్రామ సమీపంలోని మేతకు తీసుకెళ్లి ఇంటికి తీసుకువస్తుండగా భారీ పిడుగు పడి ఆవుతోపాటు డొంబు మృతి చెందాడు. దీంతో మంజగుడలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని డొంబు కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.