అరకులోయ మండల పరిసర ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు నుంచి, ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు కొనసాగించారు. రెండు రోజులుగా అరకులో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఉదయం నుంచి, మధ్యాహ్నం వరకు ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతుండగా, మరోవైపు భారీవర్షాలు కురుస్తున్నాయి. ఉదయం పూట కమ్మేస్తున్న మంచు దుప్పటితో అరకు సందర్శనకు వచ్చిన పర్యాటకులను ఆకట్టుకుంటుంది.