అరకు: దంచి కొట్టిన వాన

అరకులోయ మండల పరిసర ప్రాంతంలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండి ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇంతలోనే ఆకాశం మేఘమృతమై భారీ వర్షం కుమ్మేసింది. దీంతో ప్రజలు ఉపశమనం పొందారు. వాహన చోదకులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజురోజుకు కురుస్తున్న వర్షాలతో తొలకరి విత్తనాలు వేసేందుకు గిరి గ్రామాల్లో రైతులు దుక్కి పనుల్లో నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్