అరకు: కుమ్మేస్తున్న కుండపోత వర్షం

అరకులోయ మండల పరిసర ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. మంగళవారం ఉదయం నుంచి ఒకసారిగా వాతావరణం మారిపోయి కుండపోత వర్షం కురుస్తుండడంతో వాహనచోదకులు, పాదాచారులు, వివిధ విధులకు వెళ్లే ఉద్యోగులు ఉపాధి హామీ పథకం పనులకే వెళ్లే కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో మట్టిరోడ్లు బురదయమయ్యాయి. ఈ ఏడాది వేసిన వరి నార్లు కూరగాయ విత్తనాలు రాగి సామ పంటలకు ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్