అరకు: భారీ వర్షంతో ఉపశమనం

అరకులోయ మండల పరిసర ప్రాంతంలో భారీ వర్షం దంచి కొట్టింది. ఉదయం నుంచి ఠారెత్తించిన ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు మంగళవారం పిడుగుల శబ్దంతో కూడిన భారీ వర్షం కురవడంతో ఉపశమనం లభించింది. కురుస్తున్న వర్షంతో పలు గ్రామాల్లో మట్టి రోడ్లు బురదమయమయ్యాయి. ఇటుకల పండుగ నేపథ్యంలో పలు గ్రామాల్లో అడవులకు వేటకు వెళ్లిన గిరిజనులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్