ఆటో, బైక్ ఢీ.. పలువురికి గాయాలు

చౌడుపల్లి పంచాయతీ గెంజిగెడ్డ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జోహార్ గ్రామం నుంచి చింతపల్లి వస్తున్న ద్విచక్రవాహనం, ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన కొర్ర కేశవ్, కొర్ర జ్యోతి, కొర్ర మీరాలను చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేశవ్‌కు కాలు విరిగిపోగా, మిగతావారికి గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్