గంజాయి నిర్మూలనపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ

హుకుంపేట మండల కేంద్రంలో పోలీసులు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలనపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి సేవించడం వల్ల యువత ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు దెబ్బతింటుందని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుకుంపేట మండల అధ్యక్షులు సతక బొంజు బాబు సూచించారు. ఈ ర్యాలీ అల్లూరి సీతారామరాజు, అరకు వ్యాలీలో జరిగింది.

సంబంధిత పోస్ట్