మత్స్యగడ్డలో మునిగి బాలుడు మృతి

గురువారం ముంచింగిపుట్టు మండలం గూడమాలిపుట్టు గ్రామానికి చెందిన వంతల లక్ష్మీపతి (14) గ్రామ సమీపంలోని మత్స్యగడ్డలో స్నానం చేస్తూ లోతైన ప్రాంతంలో బురదలో కూరుకుపోయి మృతి చెందాడు. అతనితో వెళ్లిన ముగ్గురు బాలురు గ్రామస్తులకు సమాచారం అందించగా, నాటు పడవలతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై తహసీల్దార్ భాస్కర అప్పారావు, ఎస్సై పి. నాని పరిశీలించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్